రియల్ ఎస్టేట్ పెట్టబడి దారుల చూపు జహీరాబాద్ వైపు
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14-05-2026 *రాబోయే రోజుల్లో ప్రధాన పట్టణాల్లో జహీరాబాద్ ఒక పట్టణంగా నిర్మాణం పుంజుకుంటుంది* జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్స్ పనులు వేగవంతం కావడంతో రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకు పుంజుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు కొత్త లేఅవుట్లు, గృహ నిర్మాణాలు, వాణిజ్య భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థలు, విద్యుత్ సౌకర్యాలు, తాగునీటి పనులు మెరుగుపడటంతో పెట్టుబడిదారులు జహీరాబాద్ వైపు ఆసక్తి చూపుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకోవడంతో భూముల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత మరియు మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి కనబరుస్తుండటంతో ప్లాట్ల కొనుగోళ్లు పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు విస్తరణ పనులు, పారిశ్రామిక అవకాశాలు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో జహీరాబాద్ నియోజకవర్గం రియల్ ఎస్టేట్ రంగంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.