డ్రాయింగ్ ద్వారా ప్రతిభను చాటిన విద్యార్థులు
జనం న్యూస్ ;15మే శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; సిద్దిపేట పట్టణంలోని భవాని అకాడమీ నిర్వహించిన డ్రాయింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలు ఉదయం 10:00 గంటల నుండి 11:30 గంటల వరకు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.ఈ పోటీలలో మొదటి బహుమతిని జి.లాస్య సాధించగా, రెండో బహుమతిని బి. సహస్ర అందుకున్నారు. పాల్గొన్న మిగతా విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా భవాని డాన్స్ అకాడమీ విజేతలకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు.యెలిగేటి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్, డ్రాయింగ్ టీచర్ వై. రమేష్ మాట్లాడుతూ,డ్రాయింగ్ అనేది పిల్లలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే గొప్ప సాధనం. ప్రతి విద్యార్థిలో ఒక ప్రత్యేకమైన ఆలోచన, ఊహాశక్తి ఉంటుంది. ఆ భావాలను రంగుల రూపంలో వ్యక్తపరచడమే చిత్రలేఖనం అని తెలిపారు.అలాగే, చిన్న వయస్సు నుంచే కళల పట్ల ఆసక్తి పెంపొందిస్తే పిల్లలలో ఏకాగ్రత, సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు తమ సృజనాత్మక చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్నారు.