ప్రైవేటు పాఠశాలలకు సహకారం అందిస్తాం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ దారిపల్లి చంద్రం

May 15, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ : 15 మే సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దారిపల్లి చంద్రం జిల్లా ట్రస్మా పాపిరెడ్డి వర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దారిపల్లి చంద్రం మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. విద్యా రంగ అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా సభ్యులు పి. భాస్కర్, జి. హరినాథ్, పవన్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper