తెలంగాణ

వినాయక మండపాన్ని సందర్శించిన కారుమూరి వెంకటరెడ్డి

వినాయక మండపాన్ని సందర్శించిన కారుమూరి వెంకటరెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి కారుమూరి వెంకటరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆశీస్సులు పొందారు.తదుపరి మండప నిర్వాహకులు, అసోసియేషన్ సభ్యులు కారుమూరి వెంకటరెడ్డిని ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో ప్రజాసేవలో మరింతగా ముందుకు సాగాలని సభ్యులు ఆకాంక్షించారు.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

ఇ-పేపర్