అందరివాడు… మనసున్న మహారాజు విద్యా వెంకట్‌ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సీనియర్ పాత్రికేయులు నాగరాజు

August 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ | ఆగస్టు 5 | తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ రెడ్డిసూర్య తెలుగు దినపత్రిక తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి విద్యా వెంకట్ జన్మదినం సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు, మీడియా మిత్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పత్రికా రంగంలో తన సౌమ్య స్వభావం, ఆప్యాయత, సేవాభావంతో అందరి అభిమానాన్ని చూరగొన్న విద్యా వెంకట్‌కు ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సూర్య తెలుగు దినపత్రిక సీనియర్ జర్నలిస్టు నాగరాజు మాట్లాడుతూ, “విద్యా వెంకట్ ప్రతి ఒక్కరినీ ప్రేమతో, ఆత్మీయతతో పలకరించే వ్యక్తి. పత్రికా రంగంలో ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో సేవలందిస్తూ, యువ విలేకరులకు మార్గనిర్దేశనం చేస్తూ, వారికి అవకాశాలు కల్పించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు. జర్నలిజం పట్ల ఆయనకున్న అంకితభావం, త్యాగనిరతి ప్రతి జర్నలిస్టుకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.పత్రికా రంగంలో విద్యా వెంకట్ మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో, ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ పలువురు సీనియర్ జర్నలిస్టులు, మీడియా మిత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు

🌐 Select Language:
📰 ePaper