అధిక మెజార్టీతో గెలిపిస్తే సంఘాన్ని అభివృద్ధి చేస్తాం సామల రవీందర్

July 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 1961 సంవత్సరములో పెద్దకోడెపాక సంఘం నుండి పద్మశాలి పెద్దల చొరవతో విభజించబడి తెచ్చిన మన సంఘం అట్టి సంఘంనకు పద్మశాలి పెద్దలు ఎంతో కృషి చేసి అభివృద్ధి పథంలో నడిపించారు. అట్టి సంఘంనకు తన సొంత బాక్ రాబట్టుకోవడానికి కీ॥। మామిడి వెంక్రప్రాజం నుండి ఎకరాలు 4:30 గుంటలు భూమి సంఘ ఇతర ఆదాయం నుండి ఖరీదు చేసినారు. వాస్తవముగా అప్పుడు ఉన్న సంఘ అధ్యక్షులు బాసని రవి సంఘానికి 6,40,000/- రూపాయలు బాకీ ఉన్న మాట. వాస్తవము కాదా! ఇప్పుడు పోటీ ప్యానల్ వారు మళ్ళీ అవినీతి చేయరని గ్యారంటీ ఏమి ఇస్తారు.సంఘ అభివృద్ధికి పాటుబడిన గత అధ్యక్షులు ఎవరు కూడా తన స్వంత డబ్బా కొట్టుకోవడం, శిలాఫలకాలు వేయించుకోవడం. చేయలేదు.గత అధ్యక్షులు ఋణమాఫీ అనంతరం రూ.28,00,000/- ఇరవైఎనమి లక్షలు క్యాప్ క్రెడిట్రూ.57,00,000/-యాభైఏడు లక్షలు ఆర్.ఆర్.ఆర్. స్కీము రూ॥ 3,00,000/- మూడు లక్షల పరికరాలు, రూ॥ 3,00,000/- మూడు లక్షల యారన్ డిపో మంజూరి చేయించినది. వాస్తవము కాదా!20 మంది సంఘ కార్మికులకు రూ. 20,000/- ఇరవై వేల చొప్పున ఋణమాఫీ చేయించడం.జరిగింది. మా ప్యాసల్ను గెలిపిస్తే ఈ క్రింది పనులను నెరవేర్చుతాముసంఘంలో పనిచేయని కార్మికులకు త్రిష్టు స్కీం నిలిపి వేస్తాం. చేనేత పని నేర్చుకున్న ప్రతి కార్మికునికి సభ్యత్వం ఇప్పిస్తాం.50 సం॥రాలు దాటిన చేనేత కార్మికుని పెన్షన్ మంజూరి చేయిస్తాం.పద్మశాలి వితంతులకు, వృద్ధులకు పెన్షన్లు మంజూరి చేయిస్తాం.సంఘంనకు చెందిన భూమిలో ప్రతి సభ్యునికి ప్రభుత్వం నుండి అర్హులకు ఇండ్లు మంజూరి చేయిస్తాం. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తాం.సంఘ కార్మికుడు మరణించినచో 11,116/- రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వగలము.గత పాలకుల కార్యకర్తల అవినీతిని కూడా బహిర్గతము చేయగలము.కార్మికులకు వైద్య సౌకర్యం, కార్మికుల పిల్లలకు విద్య విషయములో చొరవ తీసుకొని ప్రోత్సహాకాలు అందజేయగలము.పైన పేర్కొన్న హామిలను ఈ క్రింద తెలిపిన ప్యానల్ సభ్యుల గుర్తులపై ఓటు వేసి అధ్యధిక మెజారిటీతో గెలిపించినచో సంఘ అభివృద్ధికి తొడ్పడగలము అని సామల రవీందర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాసాని చంద్ర ప్రకాష్ మాజీ సర్పంచ్ కందగట్ల రవి బాసాని లక్ష్మీ నారాయణ బసాని చంద్ర మొగిలి తదితరులు పాల్గొన్నారు…

🌐 Select Language:
📰 ePaper