అనాతవరంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమం* పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు
జనం న్యూస్ జూలై 1 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) ముమ్మిడివరం మండలం అనాతవరంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ మొత్తాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి పెన్షన్‌ను ఒక పథకంగా కాకుండా, పేదల జీవితానికి భరోసాగా రూపొందించారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతినెలా ఇంటి ముంగిటకే పింఛను అందించడం కూటమి ప్రభుత్వ సంకల్పం. పేదల గౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం. ఒక్క లబ్ధిదారుడు కూడా వెనుకబడకుండా, అర్హులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోంది” అని తెలిపారు.పెన్షన్ భరోసా ద్వారా పేదల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడమే పాలన ఉద్దేశమని, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద చ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఉపాధ్యక్షుడు నరసింహారావు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ,అ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.