గుంటూరు జిల్లా భాజపా ఇన్‌ఛార్జిగా యాళ్ల వెంకట రామ్మోహన్ రావుకు అభినందనలు
జనం న్యూస్ జూలై 1 (ముమ్మిడివరం ప్రతినిధి ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల వెంకట రామ్మోహన్ రావు దొరబాబు వారి ని భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జిగా నియమించిన సందర్భంగా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, ముమ్మిడివరం అసెంబ్లీ ఎస్ ఐ ఆర్ సమన్వయకర్త గొల కోటి వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టా సూరిబాబు, రైతు మోర్చా కార్యదర్శి కోనే రామమూర్తి తదితరులు పాల్గొని దొరబాబు వారికి అభినందనలు తెలిపేరు