జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం లో వాల్మీకి మహర్షి గుడినందు ఘనంగా

July 1, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 01 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : రాజ్యాధికార సమరభేరి పోస్టర్ల ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని కోరారు.భువనగిరి మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి మహాసభ పోస్టర్లను అయిజ పట్టణ కేంద్రంలో జిల్లా నాయకులు పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పీ జి కె.గోవింద్ రాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ జిల్లా మీడియా ఇంచార్జ్ యు,రాముడు పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి. డా. పీ జి కె. వెంకటేశ్వరరావు, ఆదేశానుసారం. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వేములవాడ మదన్మోహన్ పిలుపుమేరకు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సామాజిక, రాజకీయ సాధికారత కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. భువనగిరి సభను విజయవంతం చేసి బహుజన శక్తిని చాటాలని కోరారు.పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా రాజ్యాధికార పార్టీ కి ప్రతి ఒక్కరు పాల్గొనాలని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

🌐 Select Language:
📰 ePaper