అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి అచ్చన్నాయుడు.
జనం న్యూస్ సెప్టెంబర్ 1 కోటబొమ్మాళి మండలం :మంగళవారం ఉదయం సంతబొమ్మాళి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వస్తూ స్థానిక అన్న క్యాంటీన్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ అంతా కలియ తిరుగుతూ ఎక్కడ ఎటువంటి లోపాలు కనిపించకపోవడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. భోజనాలు చేస్తున్న పలువురితో ముచ్చటిస్తూ రోజు వస్తున్నారా, భోజనాలు ఎలా ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయ, భోజనం సరిపోతుందా అనే ప్రశ్నలు సంధిస్తూ వారి నుంచి అన్నిటికీ బాగున్నాయంటూ సమాధానం రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ మాలాంటి వారికి ఎంతో ఉపయోగ పడుతుందని పలువురు చెబుతుండడంతో వెరీ గుడ్ అంటూ వారికి మంత్రి కితాబ్ ఇచ్చారు . అయితే క్యాంటీన్ ముందు అంతంత మాత్రం వర్షపు నీరు నిలువ ఉండడాన్నీ గమనించిన మంత్రి నిర్వాహకులతో ఎం.పీ.డీ.వో దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ నీరు నిలువ లేకుండా చర్య చేపట్టాలని, వర్షపు నీరు నిలువ ఉంటే సూక్ష్మ క్రిములు చేరటం, నాచు పట్టడం వంటివి జరిగి భోజనాలకు వచ్చే వారికి అసౌకర్యం కలుగుతుందని, అందువలన త్వరితగతిన దాని నిర్మూలించే చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట దేశం మండల పార్టీ అధ్యక్షుడు బోయిన సత్య శ్రీనివాస్, పల్లి రాంబాబు, సిబ్బంది ధర్మాన నాగరాజు, లాడి శ్రీనివాసరావు, నేతింటి అప్పన్న తదితరులు ఉన్నారు.