రేషన్‌ బియ్యంపై దళారుల కన్ను

September 1, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండలంలో పక్కదారి పడుతున్న పేదల బియ్యం కరువైన అధికారుల పర్యవేక్షణఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్‌ బియ్యంపై అక్రమార్కుల కన్ను పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి, అనంతరం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
రేషన్‌ దుకాణాల వద్దే కొందరు దళారులు లబ్ధిదారులను సంప్రదించి బియ్యం కొనుగోలు చేస్తున్నారు అనంతరం ఆటోలు, ఇతర చిన్న వాహనాల ద్వారా బియ్యాన్ని ఒకచోట చేర్చి, అక్కడి నుంచి పెద్ద వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అధిక మొత్తంలో లాభాలు గడిస్తున్నారు శాయంపేట మండల పరిధిలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై గతంలో అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టిన ఘటనలు కూడా ఉన్నాయిపర్యవేక్షణ ఏదీ?రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ఈ-పాస్‌, బయోమెట్రిక్‌ వంటి విధానాలు అమల్లో ఉన్నప్పటికీ అక్రమ కొనుగోళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి మండలంలోని రేషన్‌ దుకాణాలు, బియ్యం నిల్వ కేంద్రాలు, అనుమానాస్పద వాహనాలపై పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందిఅధికారులు దృష్టి సారించాలి
పేదలకు చేరాల్సిన బియ్యం అక్రమ వ్యాపారానికి తరలితే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని ప్రజలు అంటున్నారు శాయంపేట మండలంలో రేషన్‌ బియ్యం కొనుగోలు, నిల్వ, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి, బియ్యం కొనుగోలు దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేదలు మండల ప్రజలు కోరుతున్నారు

🌐 Select Language:
📰 ePaper