అమలాపురంలో ఘనంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ
జనం న్యూస్ జూన్ 19 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)*రాష్ట్రంలో కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అమలాపురంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి ఎన్డీఏ విజయోత్సవ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు * . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ హాజరై రాష్ట్రంలో గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అనే రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.పేదలు, రైతులు, మహిళలు, యువత, వృద్ధులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో ఇతర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి , పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.