యోగాతో మానసిక ప్రశాంతత సాధ్యం” – యోగాచార్య బి. లక్ష్మీ నారాయణ

June 19, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 19 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) “నిత్యం యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి”
“యోగాతో అనేక ప్రయోజనాలు”అంతర్జాతీయ యోగా దినోత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ల శ్రీ వీరేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో, దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణం రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదర్శ యోగాచార్య అవార్డ్ గ్రహీత, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ యోగాచార్య శ్రీ బి. లక్ష్మీ నారాయణ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు యోగ శిక్షణ ఇచ్చారు.”యోగ ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” అనే ఈ ఏడాది థీమ్‌కు అనుగుణంగా వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.యోగ ఉపయోగాలపై యోగాచార్య లక్ష్మీ నారాయణ వివరిస్తూ, “యోగా అనేది కేవలం వ్యాయామం కాదు. ఇది సంపూర్ణ జీవన విధానం. నిత్యం 20 నిమిషాల యోగా సాధనతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. రక్తపోటు, మధుమేహం, నడుము నొప్పి వంటి సమస్యలను నియంత్రించ వచ్చు. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తించి ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు. యోగ దినోత్సవం ఒకరోజు పండుగ కాకుండా ప్రతిరోజూ ఆచరించాలని పాల్గొన్న వారంతా ప్రతిజ్ఞ చేశారు.స్థానిక సాయి, శాంతి నికేతన్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు సుమారు 200 మంది పైగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న విద్యార్థులకు యోగ సాధక అభినందన పత్రం, స్వామి వారి ప్రసాదం అందజేశారు. యోగాచార్య శ్రీ బి. లక్ష్మీ నారాయణ ని చైర్మన్ దుశ్శాలువతో, స్వామి వారి చిత్రపటంతో, ప్రసాదంతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి ఏర్పాట్లను అసిస్టెంట్ కమీషనర్ శ్రీ వి. సత్యనారాయణ, పర్యవేక్షణ అధికారి శ్రీ కఠారి శ్రీనివాస రాజు పర్యవేక్షించారు.ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ అర్చకులు, పురోహితులు ధార్మిక సిబ్బంది కార్యాలయం సిబ్బంది ఎస్ ఎస్ ఎఫ్ ధర్మ ప్రచారక్ బొంతు కనకరావు పేరాబత్తుల రామకృష్ణ పాల్గొని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper