అయిజ లోని భారత్ పెట్రోల్ పంప్ లో మోసాలు
జనం న్యూస్ 11 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపాలిటీ కేంద్రంలోని మేడికొండ చౌరస్తా పక్కన ఉన్న భారత్ పెట్రోలియం పంపులో తోట వాళ్లకు సంబంధించిన పెట్రోల్ పంపు పెట్రోల్ పోసుకోవడానికి వస్తున్న కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఉదాహరణకు 110 రూపాయలు పెట్రోల్ ఫీడ్ చేసి పెట్రోల్ పోసే టైం లో కనీసం 110 రూపాయలు రాక మొదలే పెట్రోల్ గన్ ఆఫ్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదేంటి ఇలా చేస్తున్నారు 110 ఫీట్ చేసిన తర్వాత ఆటోమేటిగ్గా 110 రూపాయలకు పెట్రోల్ ఆగిపోతుంది కదా ముందుగానే ఎందుకు బందు చేస్తున్నారు అని అడిగితే నీవు చూసావా అయిపోయింది అందుకే తీశాను అంటూ బెదిరింపులకు దిగుతున్నారు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకపో నేను చేసేది ఇంతే ఫోటో తీసుకుంటావా తీసుకో భయపడేది లేదంటూ అంటూ కస్టమర్లపై తిరగ బడుతున్నారు. ఇలాంటి వారిపై భారత్ పెట్రోలియం అధికారులు ఉన్నతాధికారు చర్యలు తీసుకొని పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ పోసేలా కస్టమర్లకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.