ఎంపీ మేడా రఘునాథ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన అశ్విని వైష్ణవ్
జనం న్యూస్ నందలూరు కడప జిల్ల సబ్ టైటిల్ :- నందలూరు ROBకు కేంద్ర రైల్వే మంత్రి సానుకూల స్పందన.నందలూరు వద్ద NH-716కు అనుసంధానంగా రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం చేపట్టా లని ఎంపి మేడా రఘునాథ రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూ లంగా స్పందించారు నందలూరు లో ప్రస్తుతం ఉన్న రోడ్డు అండర్ బ్రిడ్జి (RUB) ఇరుకుగా ఉండ టంతో, ప్రధానంగా చిన్న వాహ నాల రాకపోకలకు మాత్రమే అనుకూలంగా ఉంది. దీంతో ఆర్టీసీ బస్సులు, వ్యవసాయ వాహనాలు, వాణిజ్య వాహ నాలు, అత్యవసర వాహనాలు, ఇతర పెద్ద వాహనాల రాకపోక లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి.నందలూరు మండ లంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా ఈ మార్గంపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో సురక్షితమైన, నేరుగా మరియు అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే రవాణా సౌకర్యం కోసం ROB నిర్మాణం అత్యవసరమని ఎంపీ మేడా రఘునాథ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా, నందలూరులోని ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయానికి, అలాగే ఆంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని, ఈ నేపథ్యంలో మెరుగైన రహదారి అను సంధానం ఎంతో అవసరమని మేడా రఘునాథ రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.