అలంపూరు లోనే సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కొనసాగించాలి

August 2, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 02 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : తాసిల్దార్ ప్రభాకర్ కి సబ్ రిజిస్ట్రార్‌ మౌనిక కి వినతి పత్రం అందజేసిన స్థానిక నాయకులు యువకులు, పట్టణ ప్రజలు అలంపూరులో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అలంపూర్ చౌరస్తాకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలిస్తే అలంపూర్ పరిసర ప్రాంత ప్రజలు రైతులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అలంపూరు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నందున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండాలని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper