వివేకానంద స్కూల్ లో ఫ్రెండ్‌షిప్ డే’ వేడుకలు

August 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్;2 ఆగస్టు ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై. రమేష్ ; సిద్దిపేట జిల్లా లోని భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో స్నేహితుల దినోత్సవం వేడుకలను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ అంతా స్నేహపూర్వక వాతావరణంతో, విద్యార్థుల నవ్వులతో కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ళ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, “మనిషి జీవితంలో స్నేహబంధం ఎంతో అమూల్యమైనది. ముఖ్యంగా పాఠశాల రోజుల్లో ఏర్పడే స్నేహాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. విద్యార్థులు చిన్నతనం నుంచే తోటివారితో కలిసిమెలిసి ఉండటం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలి” అని సందేశాన్నిచ్చారు.ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ లిఖిత, ఉపాధ్యాయినిలు రత్నమాల,భాగ్యమ్మ,ఫిర్దోజ్,కృష్ణవేణి,రింష,మానుష,భారతి పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper