ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా కుమార్.

August 1, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 02ఆగష్టు పెగడపల్లి పెగడపల్లి: భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగం ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడుగా ఐతిపెల్లి గ్రామానికి చెందిన కూన కుమార్ ను నియమించినట్లు బిజెపి మండల అధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కూన కుమార్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి పార్టీకి చేసిన సేవను గుర్తించి తనకు ఇచ్చిన పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని మండలంలోని బీసీల అందరిలో చైతన్యం తీసుకువచ్చి బిజెపికి మద్దతు తెలియజేసే విధంగా శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు.తన నియామకానికి సహకరించిన బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ఉపాధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు కన్నం అంజయ్య మండల అధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొమ్ము రాంబాబు జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ మాజీ మండల అధ్యక్షుడు గంగుల కొమురెల్లి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper