కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్-రాజా ప్రసాద్
జనం న్యూస్-ఆగస్టు 1- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాజా ప్రసాద్ సందర్శించారు, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ హరికృష్ణతో రోగులకు అందించే మందులు మరియు డ్యూటీ డాక్టర్ల సమయపాలనపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఎటువంటి వదంతులను నమ్మవద్దని ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు, అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావలసిందిగాసూచించారని, అలాగే రోగులకు నాణ్యమైన వైద్యం అందించవలసిందిగా కోరారని తెలిపారు, డ్యూటీ డాక్టర్లు సమయపాలన పాటించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు నిరాదరణ ఆరోపణలు చేయవద్దని, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని వచ్చే ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ చందులాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.