అవకాశం ఇవ్వండి… వారసత్వ సభ్యత్వాలు అందజేస్తాం. దిడ్డి రమేష్
జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చేనేత సహకార సంఘం ఎన్నికల్లో తమ ప్యానెల్ గెలిపిస్తే కార్మిక కుటుంబ సభ్యులకు చేనేత సభ్యత్వం అందజేస్తామంటూ మాజీ చైర్మన్ దిడ్డి రమేష్ అన్నారు. బుధవారం కార్మిక ఓటర్లను కలుసుకొని తమ మేనిఫెస్టో తో కూడిన కరపత్రాలను అందజేస్తూ తెలిపారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పద్మశాలి కులస్తులకు కమ్యూనిటీ భవనాన్ని నిర్మించి తీరుతామని హామీ ఇచ్చారు. చేనేత సంఘం కు సంబంధించిన స్థలం కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తామని తెలిపారు. కార్మికులకు అందాల్సిన పింఛన్లను తమ వంతు బాధ్యతగా మంజూరుకు కృషి చేస్తామని, సంఘాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చి కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామని అన్నారు. బాసాని ప్రకాష్ నేతృత్వంలోని తమ ప్యానెల్ కార్మికులు పోటీ చేస్తున్న అభ్యర్థులు గడ్డం వెంకటేశ్వర్లు బాసాని నవీన్ బాసాని ప్రకాష్ బూర సురేష్ మామిడి జగన్నాథం వనం దేవరాజు మహిళా అభ్యర్థులు వలుపదాసి స్వరూప తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు వంగరి సాంబయ్య కు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు…..