ఆత్మీయతను చాటిన రక్షాబంధన్ వేడుకలు
జనం న్యూస్ :28 ఆగస్టు శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: రక్షాబంధన్ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం పరస్పరం రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ సందర్భంగా మిమిక్రీ వై. రమేష్ మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలు, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సోదరీమణులు కట్టే రాఖీ అన్నదమ్ముల్లో బాధ్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, సంతోషాలను నింపే రక్షాబంధన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యుల ప్రేమ, సోదరీమణుల ప్రోత్సాహం జీవితంలో ముందుకు సాగేందుకు కొండంత బలాన్ని ఇస్తుందని తెలిపారు.