కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
మహిళల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: బండి రమేష్
జనం న్యూస్ ఆగస్టు 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మహిళా నాయకురాళ్లు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ కి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బండి రమేష్ మహిళలకు రక్షాబంధన్ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.మహిళల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా మహిళలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని బండి రమేష్ హామీ ఇచ్చారు.రాఖీ కట్టిన మహిళలను ఆత్మీయంగా ఆశీర్వదించిన బండి రమేష్ మహిళలు కుటుంబంతో పాటు సమాజం, రాజకీయాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం తదితర అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.