ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

August 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలం లో నెక్స్ట్ జెన్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వాహకులు శ్రీ షబ్బీర్ అహ్మద్, ఆద్దూరి లక్ష్మీనారాయణ, పి మహిర్ ఖాన్, వి. జయ కుమార్ రెడ్డి, సోయబ్ అహ్మద్, శ్రీ మురళి మరియు ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు నందలూరు ఎంపీపీ పాఠశాల నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వ హించడం జరిగింది. ఈ కార్య క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఆహ్వానితుల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి లోకేష్, నందలూరు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి తో కలిసి పాల్గొని నిర్వాహకులను మరియు హాస్పిటల్ మరియు వైద్య సిబ్బందిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, తోటరామయ్య , యువ నాయకులు మల్లికార్జున, కొత్తపల్లి వెంకటేష్, కొల్లా తులసిరాం తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper