బి జీఆర్ హై స్కూల్(సి బి యస్ ఇ) లో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ సందర్బంగా విలేకరుల సమావేశం

August 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 28 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోకులమ్మ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలో బి జి ఆర్ హైస్కూల్లో ఎన్నికల నామినేషన్ పత్రాల స్వీకరణ అభ్యర్థుల హామీల వెల్లడి ఐజ మండల కేంద్రంలోని బి జి ఆర్ హై స్కూల్ (సి బి యస్ ఇ) లో పాఠశాల విద్యార్థుల స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీ బాల వెంకట రెడ్డి చైర్మన్ సరస్వతి దేవి మరియు ప్రిన్సిపాల్ వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి అభ్యర్థులు తమ ఎన్నికల నామినేషన్ పత్రాలను పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరావు కి అందజేశారు. అనంతరం స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు విలేకరుల సమావేశంలో అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంక్షేమం పాఠశాల అభివృద్ధి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపుదల పాఠశాలకు మరింత మంచి పేరు తీసుకురావడానికి చేపట్టబోయే కార్యక్రమాలపై అభ్యర్థులు ఎంతో ఆత్మవిశ్వాసంతో తమ ఆలోచనలు మరియు ప్రణాళికలను వివరించారు అనంతరం తోటి విద్యార్థుల సమక్షంలో అభ్యర్థులు తమ ఎన్నికల గుర్తులను పరిచయం చేశారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు నాయకత్వ లక్షణాలు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌చార్జీలు వ్యాయామ ఉపాధ్యాయులు అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper