ఆర్.టి.ఐ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జహీరాబాద్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్‌గా మల్గి సునీల్ నియామకం

జనం న్యూస్10-09-2026 సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంటి ముదిరాజ్ గారు రాష్ట్ర అధ్యక్షులు సుర స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలు మొహమ్మద్ సర్దార్ గారి అధ్వర్యంలో హైదరాబాద్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో జహీరాబాద్ వైస్ ప్రెసిడెంట్ యం సునీల్ గారిని నియమించడం జరిగింది.ప్రజల హక్కుల పరిరక్షణకు, పారదర్శకత కోసం కృషి చేస్తా: మల్గి సునీల్ జహీరాబాద్: RTI సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జహీరాబాద్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్‌గా మల్గి సునీల్ గారిని నియమించారు. ఈ మేరకు కమిటీ నాయకత్వం ఆయనకు బాధ్యతలను అప్పగించింది.ఈ సందర్భంగా మల్గి సునీల్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి జహీరాబాద్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించిన RTI సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ప్రజలకు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు.జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి హక్కుల పరిరక్షణ కోసం నిబద్ధతతో పనిచేస్తానని మల్గి సునీల్ పేర్కొన్నారు. RTI చట్టం ద్వారా ప్రజలకు అందాల్సిన సమాచారాన్ని పొందే విధానంపై అవగాహన కల్పిస్తూ,ప్రజాసేవలో ముందుకు సాగుతానని తెలిపారు.RTI సమాచార హక్కు చట్టం సాధన కమిటీ డా. చంటి ముధిరాజ్ చైర్మన్ సర్ గారికి & సుర స్రవంతి గారికి & మల్లం వెంకటేశం గారికి & కమిటీ సభ్యులకు మరియు నూతన బాధ్యతలు లభించడం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.నా పైన నమ్మకంతో జహీరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గా నన్ను నియమించిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతి ఒక్కరికీ నాయకులకు, మిత్రులకు, నాకు అభినందనలు తెలిజేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు .