ఆషాఢ బోనాల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నేత ప్రేమ కుమార్

August 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్, ఆగస్టు 6 తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జ్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ డివిజన్‌లో ఆషాఢ బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా పలు దేవాలయాల కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయాలను సందర్శించిన ప్రేమ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి ఆశీర్వాదం పొందారు.ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ కుమార్‌కు ఘన స్వాగతం పలికి, బోనాల ఉత్సవాల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి, సుభిక్షాలు నెలకొనాలని ప్రేమ కుమార్ అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, పండుగ సూర్యతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper