ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళి.
జనం న్యూస్ ఆగస్టు 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మాధవరం నగర్ కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కుల పెద్ద భాస్కర్ రావు, మాచర్ల భద్రయ్య, ఆంజనేయులు, మధు, రవీందర్ రావు, రమేష్ ,వెంకట్ రెడ్డి, యశ్వంత్, కొండలరావు, సతీష్ కుమార్, శ్రీనివాస్ సాగర్, బాబు, వాసు, జగదీష్ ,వెంకన్న, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, సతీష్, మల్లయ్య ,రాజు,శ్రీధర్ రావు, కుమార్ యాదవ్, రమేష్ ,విజయ్ సాగర్, మాధవి రెడ్డి, రాధిక, అనిత, కరుణ, తదితరులు పాల్గొన్నారు.