నాలుక నివారణే మందు.

August 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు ఆగస్టు 06-08-2026 గురువారం గొర్రెల రోగాలకి ప్రస్తుత సీజన్లో గొర్రెల్లో సోకే నీలి నాలుక వ్యాధి (బ్లూటంగ్) వల్ల కాపర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ వ్యాధి పట్ల అప్రమత్తమై నివారణ చర్యలు చేపడితే గొర్రెలను ప్రాణనష్టం నుంచి కాపాడుకోవచ్చని పెబ్బేరు మండలం రంగాపురం ఉప సర్పంచ్ పెద్దింటి నందీశ్వర్ సూచించారు. పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామంలో గొర్రెలు, మేకలకు బ్లూ టంగ్ వ్యాక్సినేష‌న్ చేసి మాట్లాడారు. పారుడు వ్యాధి ఓ వైరస్ వల్ల వస్తుందని, ఈ వ్యాధి రావడంతో జీవాల్లో జీర్ణ, శ్వాస, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంద‌న్నారు. వంద శాతం సబ్సిడీతో రైతులకు ఉచితంగా ఈ టీకాలు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. పెంప‌కందారులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు దాది శేఖర్, ఉపాధ్యక్షులు ఆటో బీసుపల్లి,వార్డు సభ్యులు రవీందర్ సాగర్, దాది మన్యం,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కావలి బాలస్వామి, ఎస్సీ సెల్ మండల నాయకులు దారపోగు వెంకటేష్, చిన్న కిష్టన్న,పింజరి సర్వర్, మండ్ల నరేష్,పెండెం రాముడు, బొంగు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. End

🌐 Select Language:
📰 ePaper