రైతులకు ఇచ్చిన దాన స్థలంలో యం ఆర్ ఓ భవనమ రైతుల చెమట కష్టంతో తడిసిన స్థలాన్ని రాజకీయాలకు తాకట్టు పెడతారా
జనం న్యూస్ 06 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం కొత్త రాజోలి ఎమ్మార్వో ఆఫీస్ యప్పుడు తెగుతుంది గతంలో రైతుల అవసరల కొరకు దానం చేసిన సర్వే నెంబరు 452/బి మఠాధిపతి శివమ్మ భర్త చిన్న మల్లయ్య50 సంవత్సరాల క్రితం రైతు హృదయం
దాదాపు 50 సంవత్సరాల క్రితం ఒక దాత రైతులకు తోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో తన సొంత పొలాన్ని రైతులకు బహుమతిగా ఇచ్చారుఎందుకో తెలుసా పంట గోదాం కట్టుకోవడానికి ధాన్యం కొనుగోలు కొలతల సమయంలో నిల్వ ఉంచుకోవడానికిఅది రాతపూతతో మాట సహాయంతో రైతులకు అందించిన పవిత్రమైన దాన స్థలం. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ఎన్నో ఏళ్లుగా రైతులు వాడుకుంటున్న ఆ స్థలాన్ని కొంతమంది రాజకీయ స్వార్థం కోసం యం ఆర్ ఓ భవనం కట్టాలని చూస్తున్నారు. ఇచ్చిన దాతలను మళ్ళీ మభ్యపెట్టి మరోసారి దానం చేయండి అని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ధర్మమా? ఇది న్యాయమా 2009 వరదలు – మనకు గుణపాఠం చెప్పాయి2009 లో వచ్చిన వరదలకు ఆ స్థలం 100% ముంపు కు గురైంది.దగ్గరలోని జడ్పీ హైస్కూల్ రికార్డులు కూడా కొట్టుకుపోయాయిఇప్పటికీ పాత విద్యార్థులు సర్టిఫికెట్ అడిగితే డేటా దొరకని పరిస్థితిఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ అదే ముంపు ప్రాంతంలో 2 కోట్ల 25 లక్షల ప్రభుత్వ డబ్బును కట్టి 11 గ్రామాల రికార్డులను మళ్ళీ వరదలకు బలి ఇవ్వడం అవివేకం కాదా కొత్త రాజోలి భవిష్యత్తుకు భద్రత రైతుల డిమాండ్ ఒక్కటే వరద ముంపు లేని కొత్త రాజోలి గ్రామంలోనే యం ఆర్ ఓ కార్యాలయం నిర్మించాలిఅక్కడ 6 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది అక్కడ కడితే డేటా 100% భద్రంగా ఉంటుందిరైతులకు న్యాయం జరుగుతుంది.
రెండు గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ప్రజల ఆవేదనరాజోలి మండల యం ఆర్ ఓ రామ్మోహన్ కి కొత్త రాజోలి రైతు సోదరులు అఖిలపక్ష కమిటీ సభ్యులు కలిసి సంతకాలతో కూడిన వినతిపత్రం అందించడం జరిగింది.మా స్థలాన్ని మమ్మల్ని అడగకుండా లాక్కోవద్దు.రాజకీయ లబ్ధి కోసం రైతుల గుండెలను పిండవద్దు మన డిమాండ్ రైతుల దాన స్థలాన్ని కాపాడాలి కోట్ల ప్రభుత్వ డబ్బును వరదల్లో ముంచొద్దు భావితరాల భవిష్యత్తు కోసం యం ఆర్ ఓ ఆఫీస్ ను కొత్త రాజోలిలోనే నిర్మించాలి