మంచన్ పల్లి లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

August 6, 2026 | తెలంగాణ

తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం

మంచన్ పల్లి గ్రామ సర్పంచ్ రాఘవేందర్.


జనం న్యూస్ 06 జులై వికారాబాద్ జిల్లా :- పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం సర్పంచ్ రాఘవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచి రాఘవేందర్ మాట్లాడుతూ..పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టించాలి”, “ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి”, “డబ్బా పాలు వద్దు – తల్లిపాలే ముద్దు” అని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్ అనసూయ, చంద్రకళ మాట్లాడుతూ, తల్లిపాలు ప్రకృతి ఇచ్చిన వరమని ప్రసవం అయిన గంటలోపే తల్లిపాలు పట్టించాలె ముర్రుపాలు శిశువుకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అందుకే తప్పనిసరిగా తల్లిపాలు తాపాలని ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, బిడ్డ అనారోగ్య పరిస్థితిలో కూడా తల్లిపాలు ఇవ్వాలి, తల్లి పాలలో ఏ, డి, విటమిన్ లు సమృద్ధిగా ఉంటుందని తల్లిపాలలో అన్ని పోషక పదార్థాలు ఉంటాయని ముఖ్యంగా తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందని ఒక రొమ్ము మొత్తం పాలు తాగిన తర్వాత ఇంకో రొమ్ము బిడ్డకు ఇవ్వాలని తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డకు మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ ఆరీఫ్, వార్ధమెంబర అనసుమ, గ్రామసంఘము అధ్యక్షలు రవలోల అనిత మునమ్మ, ఉమ, లక్ష్మి (శ్రీకళ, శిరీష్)సబిత అంగనవాడి టీచర్లు అనసూయ, చంద్రకళ ఆశ మంజుల, ఈశ్వరమ్మ పాల్గొన్నారు .

🌐 Select Language:
📰 ePaper