ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్ జయంతి వేడుకలు
జనం న్యూస్ 06ఆగష్టు పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు లలిత పూలమాలతో అలంకరణ ప్రారంభించారు. అదేవిదంగా ఉపాధ్యాయులు జయశంకర్ సార్ గురించి, ఆయన త్యాగల గురించి, నీళ్లు నిధులు, నియామకాల గురించి వివరించడం జరిగింది, విద్యార్థులకు మిఠాయిలు పంపకం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు లచ్చయ్య, మాధవి, శంకరయ్య, శ్రావణకుమార్, జ్యోతి , లక్ష్మణ్,విజయ్ కుమార్, వేణుగోపాల్, శ్రీనివాస్,శ్రీధర్ రమేష్,అహమ్మదుఖాన్, అనురాధ పాల్గొన్నారు