ఇగురంబాద శ్రీనివాస్ రాష్ట్ర బీసీ రాష్ట్ర నాయకులు
జనం న్యూస్ ఆగష్టు 08 ప్రతినిది ఎండీ జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలంలో ఏర్పాటు చేసిన ప్రజల వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని అన్యాయంగా తొలగించడం తెనుగొళ్ల జాతి ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా భావిస్తున్నాం. ఎక్కడైనా రాజ్యం భ్రష్టమై అవినీతి, దోపిడీ, అత్యాచారాలు పెరిగినప్పుడు ప్రజల నుండి వీరులు ఉద్భవిస్తారు.ప్రజలే వారిని రూపొందించుకుంటారు. అలా కాలం కడుపు చేసుకొని జన్మనిచ్చిన వ్యక్తి పండుగ సాయన్న. ఆనాటి ఆధిపత్య శక్తుల నుంచి ప్రజలను కాపాడడం కొరకు అవతరించిన దేవుడు పండుగ సాయన్న. పండుగ సాయన్నను గౌరవించడం అంటే బహుజన జాతులను గౌరవించడంతో సమానం. పండుగ సాయన్నను అవమానించడం అంటే బహుజన జాతులను అవమానించడం తో సమానం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న తెనుగోళ్ల జాతిలో ఐక్యత లేకపోవడం వలన సులభంగా విగ్రహాన్ని తీయగలిగారు. కానీ మన ఐక్యతను చూపవలసిన అవసరం ఉంది. శాంతియుతంగా పోరాటం చేసి, పండుగ సాయన్న విగ్రహాన్ని యధాతథ స్థలంలో ఉంచే విధంగా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. శాంతియుత పోరాటంతో ఎంత గొప్ప కార్యాన్నైనా సాధించవచ్చని చరిత్ర చెబుతుంది.కాబట్టి శాంతియుతంగా మన నిరసనను తెలుపుదాం. పండుగ సాయన్న విగ్రహాన్ని నిలుపుదాం.