ఉదయ్ టీం దివ్యాంగుల అసోసియన్ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లెటర్ ఇవ్వడం జరిగింది

May 21, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 21 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ విషయం: జోగులాంబ గద్వాల జిల్లాలోని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ మరియు ఉపాధి అవకాశాల కల్పనపై విన్నపం -ఉదయ్ అసోసియేషన్ ఆర్యాజోగులాంబ గద్వాల జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం మరియు వారి హక్కుల కోసం పనిచేస్తున్న ఉదయ్ (ఉదయ్) అసోసియేషన్ తరపున ఈ క్రింది ప్రధాన సమస్యలను మీ సానుకూల పరిశీలన కోసం సమర్పిస్తున్నాము.మా ప్రధాన డిమాండ్లు: బ్యాక్‌లాగ్ పోస్టుల వెరిఫికేషన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే వెరిఫికేషన్ చేయించి, వాటి భర్తీకి తక్షణ చర్యలు చేపట్టాలి.ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్: ఆర్ పి డబ్ల్యూ డి 2016 ప్రకారం జిల్లాలో జరిగే అన్ని కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ నియామకాల్లో 4% రిజర్వేషన్ పక్కాగా అమలు చేయాలి. ముఖ్యంగా కలెక్టర్ పరిధిలోని టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, మరియు హెల్ప్ డెస్క్ ఉద్యోగాలలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.గ్రామ స్థాయి ఉపాధి: జిల్లాలోని గ్రామాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులలో దివ్యాంగులకు 4% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో వాటా: జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలి సి యస్ ఆర్ ఫండ్స్ & ఉపాధి: జిల్లాలోని ప్రభుత్వ సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థల యన్ జి ఓ యస్ ద్వారా సి యస్ ఆర్ నిధులను సేకరించి, వాటిని దివ్యాంగుల ఉపాధి మరియు జీవనోపాధి పథకాల కోసం ఉపయోగించాలి.సెక్షన్ 92 అవగాహన: ఆర్ పి డబ్ల్యూ డి లోని సెక్షన్ 92 (దివ్యాంగులపై దాడులు, వివక్షకు శిక్షలు) గురించి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్పష్టమైన అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలి.జిల్లా కలెక్టర్ ఫండ్ (5% నిధులు): జిల్లా కలెక్టర్ నిధుల నుండి 5% నిధులను కేవలం దివ్యాంగుల కోసం కేటాయించాలి. ఈ నిధులను నిరుద్యోగ దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు వాడుకోవాలి. అడ్డంకులు లేని వాతావరణం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో దివ్యాంగుల సంచారానికి వీలుగా (ర్యాంపులు, లిఫ్టులు మొదలైనవి) ఉండేలా చూడాలి ఆర్ టి డబ్ల్యూ డి యాక్ట్ కమిటీ & గ్రీవెన్స్ డే: జిల్లా స్థాయిలో ఆర్ పి డబ్ల్యూ డి యాక్ట్ కమిటీ’ని బలోపేతం చేయాలి. అలాగే, ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించాలి.వ్యవసాయ మార్కెట్ కమిటీలలో (ఎ యం సి ) ప్రత్యేక స్లాట్లు:జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులలో షాపుల కేటాయింపులో లేదా వ్యాపార అనుమతులలో దివ్యాంగులకు ప్రత్యేక కోటా/స్లాట్లు కేటాయించాలి.బస్టాండ్ ఆవరణలో షాపులు:బస్టాండ్లలో ఉండే వాణిజ్య షాపుల (సెంట్రల్ స్టైల్ ) టెండర్లలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలి లేదా వారికి ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు సడలించాలి. పార్కింగ్ టెండర్లు:బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉండే వాహన పార్కింగ్ టెండర్లను నిర్వహించే బాధ్యతను అర్హులైన దివ్యాంగులకు కేటాయించాలి.పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ:బస్టాండ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లోని ‘సులభ్ కాంప్లెక్స్’ లేదా పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ టెండర్లలో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలి.రేషన్ డీలర్ షిప్: కొత్తగా రేషన్ షాపులు కేటాయించేటప్పుడు దివ్యాంగులకు 5% ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులకు గొప్ప ఆర్థిక భరోసా ఇస్తుంది.మీసేవ సెంటర్లు: మీసేవ లేదా సిటిజన్ సర్వీస్ సెంటర్ల లైసెన్సులు ఇచ్చేటప్పుడు, అర్హత కలిగిన దివ్యాంగ నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల వారు గౌరవంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలరు.జిల్లాలోని వందలాది మంది దివ్యాంగుల ఆశలను మీ ముందు ఉంచుతున్నాం. మీరు స్పందించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము.ఇట్లు,ఉదయ్ అసోసియేషన్ జోగులాంబ గద్వాల జిల్లా దివ్యాంగులు

🌐 Select Language:
📰 ePaper