ఉపాధ్యాయుడు దైనంపెల్లి కుమారస్వామి 47వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ్ సదయ్య*
జనం న్యూస్ జూన్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామం చెందిన ప్రముఖ ఉపాధ్యాయులు దైనంపెల్లి కుమారస్వామి 47వ జన్మదినోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు అభిమానులు కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామ అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రగతి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ గ్రామస్తులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తహరపుర్ మాజీ సర్పంచ్ రేణి కుంట్ల సదయ్య, , కరుణ్ బాబు, ప్రభాకర్, సుధాకర్, విజయ్ గ్రామస్తులు పాల్గొని ఉపాధ్యాయులు ధైనంపెల్లి కుమార్ కి కేక్ కట్ చేసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.