ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

June 21, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూన్ 21,అచ్యుతాపురం:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అచ్యుతాపురం మండలం పూడిమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అప్పారావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ప్రాచీనమైన యోగాసనాల ద్వారా మానసిక ప్రశాంతత తో పాటు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని అన్నారు. భారత ప్రధాని అంతర్జాతీయ యోగా దినోత్సవం అమలు చేస్తూ యోగాసనాల ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారని అన్నారు. విద్యార్థి దశ నుండి యోగాసనాలు అభ్యసించి సన్మార్గంలో ఉన్నత విలువలను పెంపొందించు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అప్పారావు , సన్యాసిరావు,గోపాలకృష్ణ,పిఈటి లు భారతి, అనూరాధ, సిఆర్పీ రాజారావు, శంకర్,వసంతరావు, బాపునాయుడు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper