పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
జనం న్యూస్ జూలై 21 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా పదాధికారుల సమావేశం శనివారం పుట్టపర్తి బిజెపి కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు జి.యం.శేఖర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద్ మరియు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్. పార్థసారథి లు హాజరు అయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని, బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాలని తెలియచేశారు.కేంద్రం లో నరేంద్ర మోడీ ప్రధాని గా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి అయినా సందర్బంగా పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీ పట్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని కోరారు.మోర్చా ల అధ్యక్షులు అన్ని మండలాలలో కమిటీ లు పూర్తి చేయాలన్నారు. సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమం లో అన్ని పోలింగ్ బూత్ లలో పాల్గొనాలని పేర్కొన్నారు.జిల్లా అధ్యక్షులు జి.ఎం. శేఖర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలు చురుకుగా పనిచేసి రాబోయే కార్యక్రమాలను సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, సాకే ఓబిలేసు, అమర్, జ్యోతి ప్రసాద్,సురేంద్ర, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మేధర శ్రీనివాసులు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.