ఉప సర్పంచ్ ల సమస్యల సాధనకై చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ
జనం న్యూస్ జూన్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని రాష్ట్రంలోని ఉపసర్పంచుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ల ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షులు మస్కి కుమారస్వామి మండల ఉపసర్పంచుల ఆధ్వర్యంలో హలో “ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ ” పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల బలోపేతానికి తాము నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపసర్పంచులకు గౌరవ వేతనం పెంపు, అధికారిక గుర్తింపు, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో తగిన అధికారాల కల్పన వంటి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఉపసర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తమ హక్కులు, అధికారాలు, సంక్షేమంపై ప్రభుత్వం సరైన దృష్టి సారించడం లేదని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని,లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లు తుడుం రాజు, దైనంపెళ్లి సుమన్,లక్ష్మారెడ్డి,తిరుపతి రెడ్డి,నరేందర్,శ్రీనివాస్, రాజు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు….