రైతు వేదికలో విత్తన మేళ

June 22, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 23జూన్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు పెగడపల్లి రైతు వేదికలో రేపటి నుండి ఒక వారం పాటు సీడ్ మేళా నిర్వహించబడును.ఈ కార్యక్రమంలో ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్న వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచబడును. అదనంగా నానో ఎరువులు కూడా అందుబాటులో ఉంటాయి. అన్ని ఎరువులు మరియు విత్తనాల డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను పొందవలసిందిగా మండల వ్యవసాయఅధికారి తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper