ఎంపీడీవో భాస్కర్ యాదవ్, కు సన్మానం
జనం న్యూస్ 17 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో నూతనంగా ప్రజావాణి ఏర్పాటు చేయడంతో ప్రజలకు రైతులకు పార్టీ నేతలకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండడంతో అందరూ ఆనందం వ్యక్తపరిచారు. ప్రతి ఒక్క సమస్య మన మండల కేంద్రంలో తీరుతుంది. అని పలువురు గ్రామాల రైతులు సంతోషపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీడీవో భాస్కర్ యాదవ్,కు ఘనంగా శాలువా వేసి పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏపిఓ లాలు నాయక్, సిందనూరు ఉప్పరి.గంగాధర్, బెనపల్లి సర్పంచ్ ముక్తార్ భాష, తూముకుంట సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పలు గ్రామాల ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.