ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం.
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సబ్ టైటిల్ :-80కి పైగా యూనిట్ల రక్తం సేకరణ.. రక్తదాతలకు అభినందనలు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసు పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరం ఘనవిజయం సాధిం చింది. ఈ శిబిరంలో దాదాపు 80కి పైగా యూనిట్ల రక్తాన్ని దాతలు స్వచ్ఛందంగా అందిం చారు.రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయ కులు, జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు, యువత పాల్గొని రక్తదానం చేశారు.రక్తదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఒక యూనిట్ రక్తం మరొకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం కల్పిస్తుందని, సమాజ సేవలో భాగంగా రక్తదానం చేయడం ఎంతో గొప్ప విష యమని నాయకులు పేర్కొ న్నారు.రక్తదాతల సేవా భావాన్ని అభినందించిన నాయకులు.. భవిష్యత్తులో కూడా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వ హించేందుకు ఏపీయూ డబ్ల్యూజే ముందుంటుందని తెలిపారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి రక్తదాతకు, సహకరించిన అధికారులు, నాయకులు, జర్నలిస్టులు, వైద్య సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.