నందికొండ మున్సిపాలిటీ సమస్యలపై ప్రజావాణి (గ్రీవెన్స్ డే) లో నల్లగొండ జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నేతల వినతి పత్రం

August 17, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్-ఆగస్టు 17- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న తీవ్ర పారిశుద్ధ్య లోపం, వెలుగని వీధి దీపాలు, కోతులు, కుక్కలు, పందులు, దోమలు నివారణ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ నేతలు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ డే (ప్రజావాణి) లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీ లోని పలు వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా లోపించిందని, చెత్త సేకరణ వాహనాలు వార్డుల్లోకి రావడం లేదని, కోతులు, వీధి కుక్కలు, పందులు సంచారం విపరీతంగా పెరిగిపోయిందని, కాలనీలలో ఒంటరిగా నడవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పందుల సంచారంతో , దుర్గంధంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని,ఫాగింగ్ చేయకపోవడం మరియు పారిశుద్ధ్య లోపం వల్ల దోమల బెడద తీవ్రమై సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, ఎక్కడి చెత్త అక్కడే తగలబెడుతుండడం వలన ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి వచ్చే ఘాటు వాసన వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని, చెత్త సేకరణ వాహనాలు వార్డుల్లోకి రావడం లేదని, హిల్ కాలనీ మెయిన్ బజార్ లో కూడా రోజు రోడ్లు ఊడవని పరిస్థితి అని అన్నారు, వినతి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ తక్షణమే స్పందించి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం ప్రేమ్ కరణ్ రెడ్డి తో మాట్లాడి తక్షణమే నందికొండ మున్సిపాలిటీ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు, కోతులను పట్టుకునే విధంగా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారుడు హిరేకార్ రమేష్ జి, విజయ్, కోడా విజయ్, మంద శాంతకుమారి, ధారా రవి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper