ఎమ్మెల్యే సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్టులు,

June 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 14. 06. 2026 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం ; నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డిని పలువురు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు చేస్తున్న సేవలను ఎమ్మెల్యే అభినందించారు. అలాగే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మీడియా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. నారాయణఖేడ్ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper