ఎల్ నినో వాతావరణ ప్రభావం పై రైతులకు సమీక్ష సమావేశం…

— వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్
బిచ్కుంద జూలై 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఫత్లాపూర్ గ్రామంలో పంటలపై ఎల్ నినో వాతావరణ ప్రభావం పై రైతులకు సమావేశం నిర్వహించడం జరిగింది, ఎల్ ని నో వాతావరణం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి భూగర్భ జలాలు మరియు చెరువులు, జలాశయాల్లో నీటి లభ్యత తగ్గిపోతుందని రైతులకు వివరించడం జరిగింది. సాగునీటి లభ్యత తక్కువగా ఉండడం మరియు వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులందరికీ వరికి బదులుగా తక్కువ నీటితో పండే పంటలు మొక్కజొన్న, జొన్న, సోయా, కందులు, పెసర్లు మరియు మినుములు వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది. వ్యవసాయ శాఖ మరియు వాతావరణ శాఖ యొక్క సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ పంటలను కాపాడుకోవాలని రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ పద్మ మారుతి , ఉప సర్పంచ్ రాజు , మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి మాధవి మరియు రైతులు హాజరయ్యారు.