కాట్రేనికోన మావుళ్ళమ్మ తల్లికి ఆషాడ శుక్రవారం విశేషాలంకరణ

July 17, 2026 | ఆంధ్రప్రదేశ్

పల్లకి సేవ, లలితా సహస్ర పారాయణంతో భక్తి శోభ

జనం న్యూస్ జూలై 17 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
ఆషాడ మాసం సందర్భంగా కాట్రేనికోనలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి ఆషాడ మాసం మొదటి శుక్రవారం విశేషాలంకరణ చేశారు. అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు.ఆలయ ప్రధాన అర్చకుడు ఆణివిళ్ళ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలిత విగ్నేశ్వర పూజ, అమ్మవారికి అభిషేకం, శ్రీ సూక్త విధానంగా సహస్రనామ కుంకుమార్చన, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు.అనంతరం నీరాజనం, మంత్రపుష్పం, వేద స్వస్తి జరిపారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా లలితా సహస్ర పారాయణం చేశారు.అలాగే ఆలయ ఆవరణలోని వినాయకుడు, షిరిడి సాయిబాబా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు విత్తనాల శంకర్, ముదునూరి రామలింగ రాజు ఆధ్వర్యంలో పులిహోర ప్రసాద వితరణ జరిగింది.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి జరిగిన పూజా విధానాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆణివిళ్ళ సాయిబాబా, ఆణివిళ్ళ రామకృష్ణ పరమహంస, ఆణివిళ్ళ పవన్, వేదుల శ్రీను, ఆ కొండిశ్రీకాంత్, తాతపూడి పండు, తదితరులు పాల్గొన్నారు.ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలతో అమ్మవారికి ధూప సేవా కార్యక్రమం జరుగుతోంది.ఈరోజు పల్లకి సేవను తాతపూడి బుల్లి, వేదుల శ్రీనివాస్ ప్రారంభించారు. భక్తులు అమ్మవారి దర్శనంతో పునీతులయ్యారు.

🌐 Select Language:
📰 ePaper