డిగ్రీ ప్రవేశాలకు మరో ఆవకాశం. కళాశాల ప్రిన్సిపాల్ కే అశోక్

July 17, 2026 | వైరల్ వార్తలు

బిచ్కుంద జూలై 17 జనం న్యూస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), బిచ్కుందలో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందదలచిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ (Degree Online Services Telangana – DOST) ద్వారా ప్రత్యేక అవకాశం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోని అర్హత కలిగిన విద్యార్థుల కోసం దోస్త్ స్పెషల్ ఫేజ్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 20-07-2026 నుండి 26-07-2026 తేదీల మధ్య దోస్త్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

🌐 Select Language:
📰 ePaper