ఎస్ ఐ ఆర్ ఓటరు ప్రక్రియ ప్రారంభం
జుక్కల్ జూన్ 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఎస్ ఐ ఆర్. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను గ్రామ సర్పంచ్ శ్రీమతి. వి. రమణ సురేష్. జిపి కార్యదర్శి. భారద్వాజ్. బి ఎల్ ఓ. గంగారం. లింగం. జిపి వార్డ్ మెంబర్స్. మల్లు గొండ. ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఓటర్ జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ తమ పేర్లను నమోదు చేసుకోవాలని. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు ప్రతి ఒక్కరు సవరించు కోవాలని సూచించారు.ఎస్ ఐ ఆర్. ప్రక్రియ ప్రారంభంలో భాగంగా. పిఎస్. 86. పిఎస్. 87. సర్వే ప్రారంభం చేయడం జరిగింది ఈ సర్వేలో ఓటర్స్ పాల్గొన్నారు.
