ధర్నాకు బయలుదేరిన ఉప సర్పంచ్లు
జనం న్యూస్ జూన్25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నేడు జరగనున్న “హలో ఉప సర్పంచ్ – చలో హైదరాబాద్” మహా ధర్నా కార్యక్రమానికి శాయంపేట మండల ఉప సర్పంచ్లుగురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు శాయంపేట సెంటర్లో అందరూ ఏకమై ఉప సర్పంచ్లు అక్కడి నుంచి ఐక్యంగా హైదరాబాద్కు పయనమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఉప సర్పంచ్లకు గౌరవ వేతనం, ప్రత్యేక అధికారాలు కల్పించడం, ఉప సర్పంచ్ చెక్ పవర్ పై వస్తున్న వార్తలను తక్షణమే ఖండించాలని తదితర ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉప సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు తెలిపారు.”మా హక్కుల కోసం మేమంతా ఒక్కటయ్యాం. శాయంపేట మండలం నుంచి మేఘంలా కదిలి వస్తున్నాం” అని ఉప సర్పంచ్లు నినదించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షులు మస్కి కుమార స్వామి మండల ఉప సర్పంచ్ ల ఫోరం కమిటీ సభ్యులు తుడుం రాజు , దాసరి లక్ష్మారెడ్డి, సంఘాల బిక్షపతి, రావుల శ్రీనివాస్, ముస్కు రాజేందర్ రెడ్డి, ఒంటెల లావణ్య కరుణాకర్, గడ్డం రాజు, మాలోత్ భాస్కర్, బానోతు సుమన్, తౌటం చరణ్, దైనం పెళ్లి సుమన్, లక్ష్మణరావు, సాయి, తిరుపతి రెడ్డి, ఐలయ్య, శ్రీనివాస్, రాజ్ కుమార్,భాస్కర్, సాదు రజిత శ్రీనివాస్, హేమ నాయక్, చంద్రమౌళి, నరేందర్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు…..