కష్టకాలంలో అండగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్
జనం న్యూస్ ఆగస్టు 7 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించిన వాసంశెట్టి సత్యం ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే, రామచంద్రపురం రూరల్ మండలం యనమదల పంచాయతీ ఏ. అగ్రహారం గ్రామానికి చెందిన కోటి ఏడుకొండలు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరగడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, బాధిత కుటుంబానికి సహాయం అందించాలని సూచించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచన మేరకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం అగ్రహారం గ్రామానికి వెళ్లి కోటి ఏడుకొండలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి, మెరుగైన వైద్య సేవలు పొందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సమయంలో ఫౌండేషన్ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కోటి ఏడుకొండలు మాట్లాడుతూ కష్టకాలంలో తమ కుటుంబాన్ని ఆదుకుని ధైర్యం చెప్పడంతో పాటు ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కంచుమర్తి బాబురావు, విత్తనాల వెంకటరమణ, ఏసుదాసు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.