గట్టుపల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం.

June 28, 2026 | తెలంగాణ

ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి.

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన గట్టుపల్లి సర్పంచ్ పద్మ-రాజు

జనం న్యూస్ 28 జూన్ వికారాబాద్ జిల్లా :- పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గట్టుపల్లి సర్పంచ్ బొల్లి పద్మ – రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. “పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని” తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం అత్యంత అవసరమని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రి సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ మంజుల, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper