వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అనంతసాగర్ చెరువు కట్ట మరమ్మతులకు శ్రీకారంముందస్తు చర్యగా శంకుస్థాపన చేసిన సర్పంచ్ వెన్నెల దయాకర్
జనం న్యూస్ జూన్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని చెరువు కట్ట మరమ్మతుల పనులకు గ్రామ సర్పంచ్ రామంచ వెన్నెల దయాకర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువు కట్ట భద్రతను పరిశీలించిన ఆయన, చాలా కాలంగా కట్టపై పెరిగిన చెట్లు, పొదలను తొలగించి, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని అధికారులకు, సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెన్నెల దయాకర్ మాట్లాడుతూ, భారీ వర్షాలు కురిసే సమయంలో చెరువు కట్ట దెబ్బతినే లేదా తెగిపోయే ప్రమాదం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యగా మరమ్మతు పనులను ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతతో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బండ చంటి రెడ్డి, హసన్‌పర్తి మండల అధ్యక్షుడు పొరెడ్డి మహేందర్ రెడ్డి, ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి, కిసాన్ సెల్ అధ్యక్షుడు వట్టె శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ బండ దామోదర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుక కుమార్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వట్టె బుచ్చిరెడ్డి, అంబాల సమ్మయ్య, తంగెళ్లపల్లి నారాయణ, నాగిళ్ల బిక్షపతి, తంగెళ్లపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.